వెన్నులో వణుకు పుట్టిస్తున్న కల్తీ పాలు

యూరియా, పంచదార పిండి , నూనె తో కల్తీ పాలు తయారి.

పట్టణంలో కల్తీ పాలు నిరంతరంగా సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు అసలు కల్తీ జరగనట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
పాలు ఎప్పుడూ తియ్యగా ఉంటున్నాయి. కాఫీ త్రాగినా టీ త్రాగినా అసలు రుచి ఉండుటంలేదు.

ఫుడ్ కంట్రోల్ అధికారులు కొంచెం మేలుకొని తనికీలు చేసి కల్తీ పాలు అరికట్టలసిందిగా కోరుతున్నాము.

మున్సిపాలిటీకి చూపించనున్న దృశ్యం సినిమా 

మన మున్సిపల్ కమీషనర్ గారు చెత్త సేకరించే ట్రాక్టర్లకు, వాటర్ ట్యాంక్ లకు జియో ట్యాగ్ లు ఏర్పాటు చేసి జవాబుదారి తనాన్ని తీసుకరావాలనుకోవడం పట్టణ ప్రజల అదృష్టం.

దృశ్యం సినిమాలో ఉన్నట్టుగా మన తెలివి గల కాంట్రాక్టర్లు  ఇక నుంచి ఈ జియో ట్యాగు ను జేబులో వేసుకొని పట్టణమంతా తిరుగుతారు.

మన కమీషనర్ గారు ఇకముందు కాంట్రాక్టరులకు డబ్బులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందేమో?

ఈ పిల్లలు మనుషులు కాదా?

సంక్షేమ హాస్టళ్లను మరచిన ప్రభుత్వం.

ఏటికి ఎదురీదుతున్న రేపటి పౌరుల బతుకులు చితికిపోకుండా కాచుకుంటూ, శాపగ్రస్తులకు ఆలంబనగా నిలవాల్సిన సంక్షేమ స్ఫూర్తి- వాస్తవంలో నీరోడుతోంది.

నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు నెలకు ఒక్కసారి అయినా వారికి సమీపంలోని పేద పిల్లలు చదువుకుంటున్న SC మరియు ST హాస్టళ్లకు వెళ్లి ఆ పిల్లల సౌకర్యాల మీద కొంచం ఆరా తీస్తే మంచిది.

జిల్లా కలెక్టర్లు , ఇతర అధికారులు తరలివెళ్లి రాత్రిళ్ళు అక్కడే విశ్రమించాలన్న ఆదేశాలు మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయాయి.

మరణమృదంగం 

నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిమీద తాత్కాలికంగా రమ్ములతో స్పీడ్ బ్రేకర్లు పోలీసులు ఏర్పాటుచేశారు. ఇలా ఏర్పాటు చేయటం వలన ప్రమాదాలు బాగా తగ్గినట్టు  సమాచారం.

మన పట్టణంలో కూడా కనీసం మూడు ప్రదేశాలలో రమ్ములతో తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లు  మన పోలీసు శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

పట్టంలో వున్న జాతీయ రహదారి మీద వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతున్నాయి. రోజూ జరిగే ప్రమాదాలే వీటికి ప్రత్యక్ష ఉదాహారణ.

  • 11-జనవరి 2017 : గణపవరం వద్ద రోడ్డు  దాటుతుండగా కారు డీకొనడంతో బిరుజు హనుమంతరావు చనిపోయాడు.

కోటప్పకొండ తిరునాళ్లలో అవమానం

పేరు గంగానమ్మ, తాగబోతే నీళ్లు లేవు

ప్రభల నిర్వహకులకు మహాశివరాత్రి రోజు దర్శనానికి VIP పాసులు ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. 

ఇప్పటివరకు ప్రభల నిర్వాహకులను పోలీసులు ఒక రకమయిన క్రిమినల్స్ గానే గుర్తించి తిరుణాలకు ముందు బైoడోవర్ కేసులు పెడుతున్నారు.

ఎంతో మంది అనామకులు రాజకీయ పలుకుబడితో VIP పాసులతో కొండ మీద చెలరేగిపోతుంటారు.

సభాపతి శ్రీ కోడెల శివప్రసాద రావు గారు, మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ విషయంలో కలగచేసుకొని ప్రభ నిర్వాహకులకు   పండుగరోజు గౌరవించి దేముడి దర్శనానికి VIP పాసులు మంజూరు చేస్తారని ఆసిద్దాo.

మహాశివరాత్రి నాడు కోటప్పకొండలో జరిగే తిరునాళ్లలో ప్రభలు ప్రత్యక ఆకర్షణ. సుమారు   15 అతి పెద్ద ప్రభలు 40 కి పైగా చిన్న ప్రభలు కడుతుంటారు.

ఒక్కొక్క పెద్ద ప్రభ కట్టడానికి అయ్యే ఖర్చు రూ 25 లక్షలకు పైనే.

అన్నయ్య Laptop / iPad ఎక్కడా?

ఆడి తప్పరాదు, పలికి బొంకరాదు 

ప్రభుత్వం ఒకవేళ Apple iPad లు ఆర్డర్ చేయకపోతే ఇప్పుడయినా చేయవచ్చు.

రాబోయే రెండు సంవత్సరాలలో ప్రభుత్వం కాలేజి పిల్లలకు సహాయం చేస్తుందని ఆశిద్దాం !అధికారంలోకి వస్తే ‘ కాలేజీ విద్యార్థులకు ఐపాడ్’ (item నెంబర్ 7 ) ఇస్తామని తెలుగుదేశం మ్యానిఫెస్టోలో ప్రకటించారు.

tdp-ipad

tdp_laptop

పైన ప్రకటించిన విధంగా లాప్ టాప్ లు కూడా అందలేదు. దయచేసి అధికారులు లాప్ టాప్ లు లేదా ఐపాడ్ లు త్వరగా అందించి పేద విద్యార్థులను ఆదుకోవాలని ఆశిస్తున్నాము.

బోగి పండుగ

సంక్రాంతి పండుగ ముందు రోజు వచ్చే బోగి పండుగనాడు తెల్లవారుజామున ప్రతి ఇంటిముందు లేదా ప్రతివీధిలోనూ బోగిమంటలు వేయడం తెలుగువారి ఆచారం. ఈ మంటలలో పాత వస్తువులను, గోమయంతో చేసిన గొబ్బి పిడకలను వేస్తారు. ఈ మంటలను వేసే బాధ్యత యువకులు తీసుకుంటే, ఆ మంటలలో వీధిలోని వారందరూ సామూహికంగా నీళ్ళు కాగబెట్టుకు తెచ్చుకుని తలస్నానాలు చేస్తారు. ఒక కార్యాన్ని సామాజికంగా నిర్వహించడం వల్ల వారిలో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇదీ భోగి మంటల విశిష్టత.

బోగిరోజున బోగిమంటల్లాగే సాయంత్రం చంటి పిల్లలు ఉన్నవాళ్ళు పళ్ళెంలో రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, పూలరేకులు కలపి పిల్లలకు దిష్టితీసి బోగిపళ్ళు పోస్తారు. ఈ బోగిపళ్ళు పోయించుకున్న చిన్నారులు కలకాలం బోగబగ్యాలతో తులతూగుతారని మన పూర్వికుల నమ్మకం.

అలాగే భోగి పండుగ రోజున చాలామంది తమ ఇంట్లో ‘బొమ్మల కొలువు’ ను ఏర్పాటు చేస్తుంటారు.
అంచెలంచెలుగా బల్లలు ఏర్పాటు చేసి వాటిపై వివిధరకాల బొమ్మలను వుంచుతుంటారు. ఈ బొమ్మల ద్వారా మన పురాణగాధలను పిల్లలకు వివరించే అవకాశం ఉంటుంది. అందువల్లనే బోగి రోజున ఏర్పాటు చేసే బొమ్మల కొలువు పిల్లలకు మానసికపరమైన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది.